Connect with us

Uncategorized

వ్యవసాయంలో ఆధ్యాత్మికత – రైతుల అవగాహన సదస్సు

Published

on

సోమయాజులపల్లి, జూన్ 5: బ్రహ్మాకుమారీస్ గ్రామీణ సేవా విభాగం, సోమయాజులపల్లి ఆధ్వర్యంలో “వ్యవసాయంలో ఆధ్యాత్మికత – రైతుల అవగాహన సదస్సు” నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమంలో రైతులకు ప్రకృతి సహజ వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ మరియు ఆధ్యాత్మిక విలువలతో కూడిన వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు దశరథ రామిరెడ్డి, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, హుస్సేన్‌పురం గ్రామానికి చెందిన రమేశ్వర్ రెడ్డి, ఒర్వకల్లు వ్యవసాయ అధికారి మధుమతి, చంద్రశేఖర్ రెడ్డి (ఒర్వకల్లు), రామకృష్ణ రెడ్డి (కర్నూలు), న్యాయవాది జనార్ధనరావు, బ్రహ్మాకుమారీస్ సోమయాజులపల్లి కేంద్ర ఇన్‌చార్జి బీకే విజయ, ఆదిలక్ష్మక్క, బీకే రాణి (బనగానపల్లి), ఒర్వకల్లు మాజీ సర్పంచ్ పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వ్యవసాయంలో ఆధ్యాత్మికతను పెంపొందించడం ద్వారా రైతులు మానసిక ప్రశాంతత, సానుకూల ఆలోచనలు మరియు ప్రకృతితో సమన్వయాన్ని సాధించగలరని తెలిపారు. రైతులు నాటిన మొక్కలను సంరక్షించడం, పర్యావరణానికి హాని కలిగించే రసాయనాల వినియోగాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడం, నీటి ప్రతి బొట్టును ఆదా చేయడం వంటి అంశాలపై ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం పాల్గొన్న వారందరూ “ప్రకృతిని కాపాడుదాం – భవిష్యత్ తరాలకు హరిత భూమిని అందిద్దాం” అనే సంకల్పాన్ని స్వీకరించారు.

– బ్రహ్మాకుమారీస్ గ్రామీణ సేవా విభాగం, సోమయాజులపల్లి
ఓం శాంతి

Continue Reading

Uncategorized

బ్రహ్మాకుమారీస్ ఆధ్వర్యంలో మూడు రోజుల బాలల వేసవి శిబిరం విజయవంతం

Published

on

కర్నూలు జిల్లా, ఓర్వకల్లు మండలం, సోమయాజులపల్లి గ్రామంలోని బ్రహ్మాకుమారీస్ సేవా కేంద్రంలో మే 29, 30, 31 తేదీలలో మూడు రోజుల బాలల వేసవి శిబిరం (Children’s Summer Camp – 2026) విజయవంతంగా నిర్వహించబడింది.

ఈ శిబిరంలో సుమారు 75 మంది పిల్లలు, 60 మంది తల్లిదండ్రులు పాల్గొని మూడు రోజులపాటు కేంద్రంలోనే బస చేశారు. ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పూర్తిగా ఉచితంగా వివిధ ఆధ్యాత్మిక, విద్యా మరియు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.

శిబిరంలో “విద్య అంటే ఏమిటి?”, నైతిక విలువలు (Moral Values), జీవన విలువలు (Living Values), సానుకూల ఆలోచన, వ్యక్తిత్వ వికాసం, రాజయోగ ధ్యానం ద్వారా మనోబలం పెంపొందించుకోవడం, శారీరక యోగా, ఆరోగ్య అవగాహన, సృజనాత్మక ఆటలు, వినోదాత్మక కార్యక్రమాలు, నాయకత్వ లక్షణాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించారు.

పిల్లలలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి వివిధ ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రశ్నోత్తర పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు. పిల్లలు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో సోమయాజులపల్లి బ్రహ్మాకుమారీస్ సేవా కేంద్ర ఇన్‌చార్జ్ బి.కె. విజయ, బి.కె. ఆదిలక్ష్మి, మౌంట్ అబూ నుండి విచ్చేసిన బి.కె. రాజేష్, బి.కె. రేవతి, బి.కె. రాజు, బి.కె. మీనాక్షి తదితరులు పాల్గొని పిల్లలకు ఆధ్యాత్మిక విలువలు, మంచి సంస్కారాలు, స్వీయ క్రమశిక్షణ, సమాజ సేవ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ముగింపు కార్యక్రమంలో తల్లిదండ్రులు మాట్లాడుతూ, పిల్లలలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల దృక్పథం పెంపొందించేందుకు ఈ శిబిరం ఎంతో ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. గ్రామ ప్రజలు మరియు తల్లిదండ్రులు బ్రహ్మాకుమారీస్ నిర్వహించిన ఈ ఉచిత వేసవి శిబిరాన్ని అభినందించారు.

Continue Reading

Brahma Kumaris Anand Sarovar